Varun Tej: 'గని' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

  • 'గని'గా వరుణ్ తేజ్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం 
  • ఏప్రిల్ 8వ తేదీన విడుదల  
Ghani movie new release date confirmed

వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ రోజున 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు. 

అదే రోజును ఖరారు చేసుకున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. 'సెబాస్టియన్' ఈ నెల 4వ తేదీకి వాయిదాపడ్డాయి. ఇక 'గని' ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వరుణ్ తేజ్ సరసన కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం కానుంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. 'ఎఫ్ 2' .. 'గద్దలకొండ గణేశ్' తరువాత వరుణ్ తేజ్ చేస్తున్న ఈ సినిమా ఆయనకి హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News