Vinod Kumar: తెలుగు తెరకి మరో సీనియర్ హీరో వారసుడు!

Vinod Kumar son becoming as a Hero
  • నిన్నటితరం హీరోగా వినోద్ కుమార్
  • 'మౌనపోరాటం'తో పరిచయం  
  • 'మామగారు'తో మంచి పేరు
  • తనయుడి ఎంట్రీకి సన్నాహాలు  

సీనియర్ స్టార్ హీరోల తనయులు చాలామంది హీరోలుగా తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరికొంతమంది సరైన సమయంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అందుకోసం తగిన కసరత్తు చేస్తున్నారు. అలాంటివారిలో వినోద్ కుమార్ తనయుడు కూడా కనిపిస్తున్నాడు. త్వరలోనే హీరోగా అతని ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి.   

90లలో హీరోగా వరుస సినిమాలతో వినోద్ కుమార్ దూసుకుపోయాడు. 'మౌన పోరాటం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వినోద్ కుమార్, చాలా తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యాడు. 'సీతారత్నంగారి అబ్బాయి' .. 'మామగారు' వంటి సూపర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.

అలాంటి వినోద్ కుమార్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని చెప్పాడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాడని అన్నాడు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News