Ramiz Raja: పీఎస్ఎల్ తాజా సీజన్ తో రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి: రమీజ్ రాజా

  • ఐపీఎల్ బాటలోనే పలు దేశాల క్రికెట్ బోర్డులు
  • పాకిస్థాన్ లో పీఎస్ఎల్ నిర్వహణ
  • ఆదివారం ముగిసిన పీఎస్ఎల్ 7వ సీజన్
  • ఒక్కో ఫ్రాంచైజీకి భారీ ఆదాయం వచ్చిందన్న రమీజ్ రాజా
Ramiz Raja says huge profits for PSL

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ విజయవంతం కావడంతో పలు దేశాల క్రికెట్ బోర్డులు కూడా లీగ్ బాట పట్టాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పేరిట కొన్నేళ్లుగా టీ20 పోటీలు నిర్వహిస్తోంది. పీఎస్ఎల్ 7వ సీజన్ ఆదివారం నాడు ముగిసింది. లాహోర్ ఖలందర్స్ పీఎస్ఎల్ విజేతగా అవతరించింది. 

కాగా, పీఎస్ఎల్ చరిత్రలోనే ఈ సీజన్ లాభాల పంట పండించిందని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా వెల్లడించారు. 71 శాతం వృద్ధితో ఈ టోర్నీలో భారీ ఆదాయం కళ్లజూశామని, పీఎస్ఎల్ చరిత్రలోనే ఇది అత్యధికమని సంబరంగా చెప్పారు. ఈ సీజన్ లో ప్రతి ఫ్రాంచైజీ రూ.38 కోట్ల వరకు ఆదాయం పొందిందని వివరించారు. టోర్నీ ప్రారంభానికి ముందే లాభాలు ఖరారయ్యాయని రమీజ్ రాజా పేర్కొన్నారు. 

టోర్నీ తొలి దశ పోటీలు జరిగిన కరాచీ, లాహోర్ వేదికల్లో ప్రేక్షకుల మద్దతు అమోఘమని కొనియాడారు. అంతటి ఉత్సాహభరితమైన ప్రేక్షక సమూహాన్ని తన కెరీర్ లో ఇప్పటిదాకా చూడలేదని వెల్లడించారు. పీఎస్ఎల్-7 అద్భుతమైన రీతిలో విజయవంతమైందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని పేర్కొన్నారు.

More Telugu News