Sharwanand: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి సాంగ్ రిలీజ్!

Adavallu Meeku Joharlu song released
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
  • శర్వానంద్ సరసన నాయికగా రష్మిక 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • ఈ నెల 4వ తేదీన విడుదల    
శర్వానంద్ హీరోగా దర్శకుడు కిశోర్ తిరుమల 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను రూపొందించాడు. చాలా కాలం క్రితం దర్శకుడు 'విసు' ఈ తరహా టైటిల్స్ తో సినిమాలు చేశాడు. ఆయన సినిమాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ తక్కువ. సరదాగా ... సందడిగా సాగే కామెడీ సన్నివేశాలు ఎక్కువ.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ' ఓ మై ఆద్య' అంటూ ఈ పాట సాగుతోంది. శర్వానంద్ - రష్మిక పై బీచ్ లో ఈ పాటను చిత్రీకరించారు. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కి డిఫరెంట్ గా అనిపించే పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ బీట్ బాగుంది. ట్యూన్ పరంగా .. చిత్రీకరణ పరంగా చూసుకుంటే, టీనేజ్ లవర్స్ కి సెట్ అయ్యే పాట అనిపించకమానదు.   

శర్వానంద్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉంటే, రష్మిక వరుస సక్సెస్ లతో ఉంది. అందువలన ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.
Sharwanand
Rashmika Mandanna
Aadavallu Meeku Joharlu Movie

More Telugu News