Jhund: నాపై ఖర్చు చేసే బదులు ఆ మొత్తాన్ని సినిమాపై పెట్టండి: అమితాబ్

Amitabh Bacchan took a pay cut for Jhund This is why
  • ‘జుండ్’ కోసం పారితోషికాన్ని తగ్గించుకున్న బిగ్ బీ
  • అమితాబ్ సిబ్బంది దారి కూడా అదే
  • టీ సిరీస్ ముందుకు రావడంతో కష్టాలకు చెక్
  • ఈ నెల 4న సినిమా విడుదల 
అమితాబ్ ఫుట్ బాల్ కోచ్ గా అభిమానులను ‘జుండ్’ చిత్రంతో అలరించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ తన పారితోషికాన్ని తగ్గించుకుని పెద్ద మనసు చూపారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు.

జుండ్ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ కారణంగా నిర్మాతలు బడ్జెట్ కు సంబంధించి ఇబ్బంది పడుతున్నట్టు అమితాబ్ తెలుసుకున్నారు. దీంతో తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. ఫుట్ బాల్ ను స్వతహాగా ఇష్టపడే అమితాబ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను ఎంతో ఇష్టపడినట్టు సందీప్ సింగ్ తెలిపారు. నచ్చిన సినిమా కావడంతో నిర్మాతల కష్టాలను గుర్తించిన అమితాబ్ ఆ ఆఫర్ ఇచ్చారు. 

‘‘నాపై ఖర్చు చేసే బదులు దానిని సినిమా నిర్మాణంపై వెచ్చించండి’’ అని అమితాబ్ అన్నట్టు సందీప్ సింగ్ తెలిపారు. అది చూసి అమితాబ్ సిబ్బంది కూడా తమకు తక్కువ మొత్తం చెల్లిస్తే చాలని చెప్పడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. టీ సిరీస్ సంస్థ జుండ్ నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు అంగీకరించడంతో మొత్తానికి ఈ సినిమా కష్టాలకు చెక్ పడింది. ఈ నెల 4న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
Jhund
movie
Amitabh Bachchan
producer
big budget

More Telugu News