ap cm ys jagan: త‌మిళనాడు సీఎంకు తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్‌

  • త‌మిళ‌నాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణుల వేడుక‌లు
  • ట్వీట్‌తో విషెస్ చెప్పిన ఏపీ సీఎం జ‌గ‌న్‌
  • ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపిన కేసీఆర్‌
kcr and jagan birth day wishes to tamilnadu cm stalin

ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే) అధినేత‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌కు మంగ‌ళ‌వారం నాడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు పోటెత్తాయి. ఎంకే స్టాలిన్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం నాడు త‌మిళ‌నాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నాయి. ఇక దేశంలోనే అత్యుత్త‌మ సీఎంగా రికార్డుల‌కు ఎక్కిన స్టాలిన్‌కు దేశంలోని ప‌లు పార్టీల కీల‌క నేత‌ల నుంచి బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తాయి.

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు కూడా స్టాలిన్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ట్వీట్‌తో స్టాలిన్‌కు జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌గా.. కేసీఆర్ మాత్రం నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

 స్టాలిన్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయ‌న‌ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు జ‌గ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మ‌రోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. సీఎం స్టాలిన్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వీలు చూసుకుని మ‌రీ స్టాలిన్‌కు కేసీఆర్ ఫోన్ చేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News