Ukraine: ర‌ష్యా యుద్ధం ఎఫెక్ట్‌... ఈయూలో ఉక్రెయిన్‌కు స‌భ్య‌త్వం

  • ఈయూలో స‌భ్య‌త్వం కోసం జెలెన్ స్కీ ద‌రఖాస్తు
  • త‌న‌దైన శైలి ప్ర‌సంగంతో ఈయూ స‌భ్య దేశాల‌ను ఆక‌ట్టుకున్న జెలెన్ స్కీ
  • వెనువెంట‌నే ఉక్రెయిన్‌కు స‌భ్య‌త్వం ఇచ్చేసిన ఈయూ
Membership to Ukraine in the EU

ర‌ష్యా మొద‌లెట్టిన యుద్ధం చిన్న దేశ‌మైన ఉక్రెయిన్‌ను ఛిన్నాభిన్నం చేసేసింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌దు. ముగిశాక ఉక్రెయిన్ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో కూడా తెలియ‌దు. అయితే యుద్ధం తర్వాత ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదురైనా ఉక్రెయిన్ త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు ఆ దేశానికి ఇప్పుడు ఓ పెద్ద అండ దొరికేసింది. ఉక్రెయిన్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ స‌భ్య‌త్వం ఇచ్చేసింది. కాసేప‌టి క్రితం ఈ మేర‌కు ఈయూ పార్ల‌మెంటు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఈయూలో స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత ఈయూ పార్ల‌మెంటుకు ద‌ర‌ఖాస్తు కూడా చేశారు. ఈ ద‌ర‌ఖాస్తు చూశాక ఈయూ పార్ల‌మెంటు అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యింది. ఈ భేటీకి జెలెన్ స్కీని కూడా ఆహ్వానించింది. 

ఈయూ ఆహ్వానం మేర‌కు ఈయూ పార్ల‌మెంటుకు వెళ్లిన జెలెన్ స్కీ చేసిన భావోద్వేగభరిత ప్రసంగానికి స‌భ్య దేశాలు స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చాయి. ఆ వెంట‌నే ఉక్రెయిన్ చేసుకున్న ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన ఈయూ పార్ల‌మెంటు..ఈయూలో ఉక్రెయిన్‌కు స‌భ్య‌త్వం ఇస్తున్నట్లుగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

More Telugu News