Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్!

  • రవితేజ తాజా చిత్రంగా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ 
  • కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ 
  • సీనియర్ హీరో వేణు రీ ఎంట్రీ
Ramarao On Duty movie update

రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందింది. ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా విడుదలకి ముస్తాబైంది. 'మహాశివరాత్రి' సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
 
యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రలన్నిటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తినీ .. అంచనాలను పెంచుతోంది. "ఆయుధంపై ఆధారపడే నీలాంటివాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది .. ఆయుధంలా బ్రతికే నాలాంటివాడి ధైర్యం అణువణువునా ఉంటుంది" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఈ టీజర్ కి హైలైట్. 

రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమాతో సీనియర్ హీరో తొట్టెంపూడి వేణు ఈ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్ .. తనికెళ్ల భరణి .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News