Mekapati Goutham Reddy: 3న గౌత‌మ్‌రెడ్డి పెద్ద క‌ర్మ‌.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

ap cabinet meeting postponed
  • ఈ నెల 3న కేబినెట్ భేటీకి నిర్ణయం
  • అదే రోజు గౌత‌మ్ రెడ్డి పెద్ద క‌ర్మ ఉండ‌టంతో మార్పు
  • మార్చి 7 నాటికి కేబినెట్ భేటీ వాయిదా
ఈ నెల 3న జ‌ర‌గాల్సి ఉన్న ఏపీ మంత్రి వ‌ర్గ స‌మావేశం వాయిదా ప‌డిపోయింది. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యే రోజు.. అంటే ఈ నెల 7న కేబినెట్ భేటీని నిర్వ‌హించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇటీవ‌లే గుండెపోటుతో చ‌నిపోయిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి పెద్ద క‌ర్మ ఈ నెల 3న జ‌ర‌గ‌నుంది. ఈ కార‌ణంగా అంత‌కుముందే నిర్ణ‌యించిన ఏపీ కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 

మార్చి 3న కేబినెట్ భేటీ నిర్వ‌హించాల‌ని గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణానికి ముందే ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే దుబాయి ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన గౌత‌మ్ రెడ్డి ఫిబ్ర‌వ‌రి 21న గుండె పోటు కార‌ణంగా హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. గౌత‌మ్ రెడ్డి మృతికి రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం..అధికార లాంఛ‌నాల‌తో ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను ముగించింది. తాజాగా గౌత‌మ్ రెడ్డి పెద్ద క‌ర్మ నేప‌థ్యంలో మార్చి 3న జ‌ర‌గాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేసింది.
Mekapati Goutham Reddy
Andhra Pradesh
cabinet meeting

More Telugu News