GST: ఫిబ్రవరి మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!

GST Collections for February
  • రూ.1,33,026 కోట్ల మేర జీఎస్టీ వసూలు
  • కేంద్ర జీఎస్టీ రూ.24,435 కోట్లు
  • ఐజీఎస్టీ రూ.67,471 కోట్లు
  • తొలిసారి పదివేల కోట్లు దాటిన సెస్

కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ గణనీయంగా కోలుకుంది. అందుకు ఫిబ్రవరి మాసం జీఎస్టీ వసూళ్లే నిదర్శనం. ఈ ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్ల వసూళ్లు వచ్చాయి. 2021 ఫిబ్రవరి వసూళ్ల కంటే ఇది 18 శాతం అధికం. అయితే, ఈ ఏడాది జనవరి మాసం వసూళ్లతో పోల్చితే స్వల్ప తగ్గుదల నమోదైంది. 2022 జనవరిలో రూ.1.40,986 కోట్ల వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ ప్రవేశపెట్టాక ఈ ఏడాది జనవరి మాసపు వసూళ్లే రికార్డు. 

ఇక, ఈ ఫిబ్రవరి వసూళ్లలో కేంద్ర జీఎస్టీ రూ.24,435 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,779 కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఐజీఎస్టీ రూ.67,471 కోట్లు (దిగుమతి సుంకం రూ.38,837 కోట్లతో కలుపుకుని), సెస్ రూ.10,340 కోట్లు. సెస్ రూ.10 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News