Telangana: పోటెత్తిన వాహ‌న‌దారులు.. నిమిషానికి 700 చలాన్ల క్లియ‌రెన్స్‌

Huge response to clearance of pending challans
  • పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్ మొద‌లు
  • తొలి రోజే వాహ‌న‌దారుల నుంచి భారీ స్పంద‌న‌
  • ఈ- చలాన్ వెబ్‌సైట్‌తో పాటు ఈ-సేవ‌, మీ సేవా సెంటర్ల‌లో చెల్లింపు
  • ఈ నెలాఖ‌రు దాకా కొన‌సాగ‌నున్న‌ క్లియ‌రెన్స్‌

భారీ రిబేట్‌తో పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహ‌న‌దారులు మంగ‌ళ‌వారం ఉద‌యం పోటెత్తారు. రూ.100 ఫైన్ ప‌డితే..రూ.25 చెల్లిస్తే స‌రిపోతుందంటూ తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన ఆఫ‌ర్‌కు వాహ‌న‌దారుల నుంచి ఓ రేంజిలో స్పంద‌న క‌నిపించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం తెలంగాణ వ్యాప్తంగా మొద‌లైన ఈ ఆఫర్.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అయితే తొలి రోజే వాహ‌న‌దారుల నుంచి ఊహించ‌ని రీతిలో భారీ స్పంద‌న ల‌భించింది. ఈ భారీ స్పంద‌న కార‌ణంగా పెండింగ్ లో ఉన్న ఛ‌లాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియ‌ర్ అయిపోతున్నాయ‌ట‌. 

పెండింగ్ చలాన్లు రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన ప్రత్యేక డ్రైవ్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది. ఆన్‌లైన్‌లో ఈ- చలాన్‌ సైట్‌ ద్వారా పెండింగ్‌ చలాన్లను వాహ‌న‌దారులు క్లియర్‌ చేసుకుంటున్నారు. 

ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి వివరాలు ఎంటర్‌ చేస్తే.. గతంలో మీ వాహనంపై ఉన్న చలాన్లు.. వాటికి వేసిన సర్‌ ఛార్జ్‌తో పాటు.. డిస్కౌంట్‌ తర్వాత మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చూపిస్తోంది. ఈ సేవ, మీ సేవ సెంటర్లలో కూడా క్లియరెన్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక  రిబేట్ విష‌యానికి వ‌స్తే.. టూవీల‌ర్‌కు 75 శాతం, కార్ల‌కు 50 శాతం, తోపుడు బండ్ల‌కు 80 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 30 శాతం రాయితీని పోలీసులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News