Adipurush Movie: ప్రభాస్ 'ఆదిపురుష్' విడుదల తేదీ మారింది!

Prabhas Adipurush movie to release on Jan 12
  • శివరాత్రి సందర్భంగా 'ఆదిపురుష్' నుంచి అప్డేట్
  • వచ్చే ఏడాది జనవరి 12న త్రీడీ ఫార్మాట్లో సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటన
  • బాలీవుడ్ స్ట్రయిట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్'కు సంబంధించి శివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ అప్ డేట్ ను చిత్ర యూనిట్ వదిలింది. ఈ ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే రిలీజ్ డేట్ ను మార్చినట్టు ప్రకటించారు. 

ఈ ప్రకారం, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న త్రీడీ ఫార్మాట్లో సినిమాను విదుదల చేయనున్నట్టు తెలిపారు. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ మారిన విషయాన్ని ప్రభాస్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
Adipurush Movie
Prabhas
Release Date
Bollywood
Tollywood

More Telugu News