Chiranjeevi: 'భోళా శంకర్'గా మెగాస్టార్ స్టయిల్ అదుర్స్!

Bhola Shankar new poster released
  • రిలీజ్ కి రెడీగా 'ఆచార్య'
  • ముగింపు దశలో 'గాడ్ ఫాదర్'
  • సెట్స్ పై ఉన్న 'భోళా శంకర్'
  • దర్శకుడిగా మెహర్ రమేశ్

చిరంజీవి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా తరువాత చిరంజీవి నుంచి 'గాడ్ ఫాదర్' రానుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. కీలకమైన పాత్రలో నయనతార కనిపించనుంది. 

ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి 'భోళా శంకర్' కూడా చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మాస్ ఆడియన్స్ కి పండగ చేయనుంది. 'మహాశివరాత్రి' సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి మెగాస్టార్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి మరింత స్టయిల్ గా కనిపించనున్నారనే విషయం ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. 

తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రాజెక్టుగా చిరంజీవి 'వాల్తేరు వీర్రాజు' చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News