hmda: ఫైళ్ల పెండింగ్‌.. న‌లుగురు హెచ్ఎండీఏ అధికారుల‌కు వెయ్యి జ‌రిమానా

  • గ‌డువులోగా ఫైళ్లు క్లియ‌ర్ చేయ‌ని అధికారులు  
  • రిపీట్ కావ‌ద్ద‌న్న ఉద్దేశ్యంతో నామ‌మాత్ర‌పు జ‌రిమానా
  • పెనాల్టీకి గురైన వారిలో ముగ్గురు ఏపీఓలు, ఓ త‌హ‌సీల్దార్‌
penalty for four hmda officers

విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే.. నిర్దేశించిన ప‌నిని గ‌డువులోగా పూర్తి చేయ‌కుంటే పెనాల్టీ క‌ట్టాల్సిందే మ‌రి. ఇలాంటి అధికారుల‌కు సంబంధించి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో పాటుగా ఏకంగా కొర‌ఢా ఝుళిపించాల్సిందే మ‌రి. తెలంగాణ స‌ర్కారు కూడా అదే ప‌ని చేసింది. నిర్దేశించిన గ‌డువులోగా ఫైళ్లు క్లియ‌ర్ చేయ‌ని కార‌ణంగా హెచ్ఎండీఏకు చెందిన న‌లుగురు అధికారుల‌కు రూ.1000 చొప్పున జ‌రిమానా విధిస్తూ ప్ర‌భుత్వం సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ అర‌వింద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

వారిలో హెచ్ఎండీఏలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు (ఏపీఓ) సుధీర్ కుమార్, రమేశ్ చరణ్, వసుంధరలతో పాటు తహసీల్దార్ గజఫర్ హుస్సేన్ ఉన్నారు. వీరి వద్ద 16 రోజుల నుంచి 27 రోజుల వరకు ఫైలు పెండింగ్ లో ఉన్నట్టు కమిషనర్ గుర్తించారు. దీనిపై విచారించి ఇలాంటి పరిస్థితులు హెచ్ఎండీఏలో పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో మొదటిసారిగా నామమాత్రపు పెనాల్టీ విధించారు.

More Telugu News