Ukraine: ఒక్క‌ తీర్మానమూ లేదు.. ర‌ష్యా, ఉక్రెయిన్ చ‌ర్చ‌లు విఫలం

  • ర‌ష్యా నుంచి ఐదుగురు, ఉక్రెయిన్ నుంచి ఆరుగురు
  • 3 గంట‌ల‌కు పైగా కొన‌సాగిన చ‌ర్చ‌లు
  • ఏ ఒక్క అంశంపైనా కుద‌రని ఏకాభిప్రాయం
Talks between Russia and Ukraine fail

ప్ర‌పంచ దేశాలన్నీ భ‌య‌ప‌డిన‌ట్టుగానే అయ్యింది. యుద్ధంతో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య సోమ‌వారం మధ్యాహ్నం మొద‌లైన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. బెలార‌స్ వేదిక‌గా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డి సాగాయి. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చేసిన డిమాండ్ల‌ను ఇరు దేశాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఈ కార‌ణంగా గంట‌ల త‌ర‌బ‌డి సాగిన ఈ చ‌ర్చ‌లు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి.

యుద్ధం మొదలైన రెండో రోజున‌నే ఉక్రెయిన్‌తో తాము చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మంటూ రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ ప్ర‌తిపాద‌న చేశారు. బెలార‌స్ వేదిక‌గా ఉక్రెయిన్ చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైతే త‌మ దేశ ప్ర‌తినిది బృందాన్ని పంపుతామంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. ర‌ష్యా మిత్రదేశంగా ఉన్న బెలార‌స్‌లో చర్చ‌ల‌కు తొలుత విముఖ‌త వ్య‌క్తం చేసిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ.. ఆ త‌ర్వాత చ‌ర్చ‌ల‌కు స‌రేన‌న్నారు. 

ఈ క్ర‌మంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత బెలార‌స్‌లో మొద‌లైన చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, ర‌ష్యా నుంచి ఐదుగురు ప్ర‌తినిధుల‌తో కూడిన బృందాలు చ‌ర్చ‌ల‌కు కూర్చున్నాయి. దాదాపుగా 3 గంట‌ల‌కు పైగానే చ‌ర్చ‌లు జరిపినా... ఏ ఒక్క తీర్మానం లేకుండానే రెండు దేశాలు చ‌ర్చ‌ల‌ను ముగించాయి.

  • Loading...

More Telugu News