Kiran Abbavaram: రేచీకటితో ఇబ్బందిపడే 'సెబాస్టియన్' .. ట్రైలర్ రిలీజ్!

  • 'సెబాస్టియన్'గా కిరణ్ అబ్బవరం
  • కామెడీతో కూడిన కానిస్టేబుల్ పాత్ర
  • కథానాయికగా నువేక్ష పరిచయం
  • మార్చి 4వ తేదీన విడుదల
Sebastian trailer released

కిరణ్ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్ PC 524' సినిమా రూపొందింది. జ్యోవిత - ఎలైట్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాతో దర్శకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి పరిచయమవుతున్నాడు. కథానాయికగా 'నువేక్ష' తెలుగులో చేస్తున్న ఫస్టు మూవీ ఇది. మార్చి 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఈ సినిమాలో హీరో పోలీస్ కానిస్టేబుల్ .. రేచీకటితో ఇబ్బంది పడుతుంటాడు. తనకి నైట్ షిఫ్టులు వేయవద్దని బాస్ ను బ్రతుమలాడుకుంటూ ఉంటాడు. ఆయన వినకపోతే .. తన డ్యూటీ చేసి పెట్టమని మిగతా పోలీస్ లను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. 


ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. రోజులు బాగానే గడిచిపోతున్నాయని అనుకునే సమయంలోనే అతను నైట్ డ్యూటీ చేయవలసి వస్తుంది. ఆ రాత్రి అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందనేదే కథ. ఆసక్తికరమైన ట్విస్టులతో పాటు, కామెడీ కూడా కావాల్సినంత ఉందనే విషయం అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News