Manchu Vishnu: సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ.. హెయిర్ డ్రెస్సర్‌పై అనుమానం

Huge theft in tollywood actor manchu vishnu office
  • రూ. 5 లక్షల విలువ చేసే సామగ్రి మాయం
  • చోరీ తర్వాత కనిపించకుండా పోయిన నాగ శ్రీను
  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ సినీనటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి గురైంది. హెయిర్ డ్రెస్సర్ అయిన నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేస్తూ మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండొచ్చని ఫిర్యాదులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Manchu Vishnu
Tollywood
Theft
Jubilee Hills

More Telugu News