Vijay Devarakonda: ప్రైమ్ వాలీబాల్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన విజయ్ దేవరకొండ

  • హైదరాబాదులో వాలీబాల్ ఫైనల్స్
  • విజేతగా నిలిచిన కోల్ కతా థండర్ బోల్ట్స్
  • రన్నరప్ గా అహ్మదాబాద్ డిఫెండర్స్
  • డిఫరెంట్ గెటప్ లో వచ్చిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda attends prime volleyball league prize distribution

గత కొన్నిరోజులుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్-2022 ముగిసింది. కోల్ కతా థండర్ బోల్ట్స్ విజేతగా అవతరించింది. ఇవాళ హైదరాబాదులో జరిగిన ఫైనల్లో కోల్ కతా థండర్ బోల్ట్స్ 15-13, 15-10, 15-12తో అహ్మదాబాద్ డిఫెండర్స్ ను ఓడించింది. కాగా, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. డిఫరెంట్ గెటప్ తో వచ్చిన విజయ్ దేవరకొండ అందరినీ ఆకర్షించారు. విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి తల్లి, సోదరుడు ఆనంద్ లతో కలిసి విచ్చేశారు. .

More Telugu News