bheemla nayak: ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాపై హాస్య‌న‌టుడు పృథ్వీరాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

pridwiraj on bheemla nayan
  • సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తర్వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ పవన్ క‌ల్యాణ్‌కి ఉంది
  • తెలుగు ప్రజలకు, పవన్ ఫ్యాన్స్‌కు అభినందనలు 
  • క్లైమాక్స్‌తో పాటు  రానా-పవ‌న్ క‌ల్యాణ్  సన్నివేశాలు అద్భుతం
  • ఈ సినిమాలో నటించలేకపోయాన‌నే బాధ ఉంది
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు దిష్టి తగలకూడదు
'భీమ్లా నాయక్' సినిమా చూసిన హాస్య‌ నటుడు పృథ్వీ రాజ్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు, పవన్ ఫ్యాన్స్‌కు అభినందనలు తెలుపుతున్నాన‌ని చెప్పారు. అప్ప‌ట్లో తాను సీనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన అడ‌వి రాముడు సినిమా చూశాన‌ని అన్నారు. 

త‌న‌ జీవితంలో ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంద‌ని చెప్పారు. అప్ప‌ట్లో  ఆ సినిమా చూడ‌డానికి తాడేపల్లి గూడెంలోని విజయా టాకీస్‌కు వెళ్తే అక్క‌డ‌కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారని గుర్తు చేసుకున్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తర్వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ పవన్ క‌ల్యాణ్‌కే ఉంద‌ని చెప్పారు. 

'భీమ్లా నాయ‌క్‌' సినిమా క్లైమాక్స్‌తో పాటు  రానా-పవ‌న్ క‌ల్యాణ్ న‌టించిన  సన్నివేశాలు చాలా బాగున్నాయ‌ని తెలిపారు. తాను కూడా ఓ ప్రేక్షకుడిలా ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేశానని అన్నారు. అయితే, ఇంత అద్భుతమైన సినిమాలో తాను నటించలేకపోయాన‌నే బాధ ఉంద‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
bheemla nayak
Pawan Kalyan
pridwiraj

More Telugu News