Rohit Sharma: ఆటలో ఉత్కంఠ.. వణికిస్తున్న చలి.. కెమెరామెన్ కు కాఫీ ఆఫర్ చేసిన రోహిత్

Rohit Sharma Offers Coffee To Cameraman In Cold Dharamsala
  • శ్రీలంకతో రెండో టీ20 సందర్భంగా కనిపించిన దృశ్యం
  • డ్రెస్సింగ్ రూమ్ ముందు కాఫీ తాగుతున్న రోహిత్
  • అది గమనించి అటువైపు కెమెరా తిప్పిన కెమెరామ్యాన్
  • దీంతో కాఫీ కావాలా? అని అడిగిన రోహిత్
శ్రీలంక-భారత్ జట్ల మధ్య ధర్మశాలలో శనివారం జరిగిన టీ20 రెండో మ్యాచ్ లో ఒక దృశ్యం ఆకట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 184 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. కానీ, ఫామ్ లో ఉన్న భారత జట్టు సునాయాసంగానే దీన్ని సాధించేసింది. కాకపోతే ఆట మొదటి భాగం ఆసాంతం ఉత్కంఠ మధ్య నడిచింది.

హిమగిరులకు దగ్గరగా ఉండటంతో ధర్మశాలలో ఉష్ణోగ్రత 4-8 డిగ్రీల మధ్య ఉంది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి వర్షపు జల్లులు పలకరించాయి. దీంతో వాతావరణం చల్లగా మారిపోయింది. భారత జట్టు కెప్టెన్, ఓపెనర్ గా వచ్చిన రోహిత్ ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్డాడు. కానీ, అక్కడి నుంచి ఆటను మాత్రం చాలా చక్కగా ఆస్వాదించాడు.

శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ మెరుపులు చూస్తూ, విజయం ఖాయమన్న ధీమాతో కనిపించాడు. అదే సమయంలో చల్లటి వాతావరణం నుంచి ఉపశమనంగా కాఫీ తాగుతూ కనిపించాడు. కెమెరా మ్యాన్ కెమెరాను రోహిత్ వైపు తిప్పాడు. దీంతో రోహిత్ కెమెరా మ్యాన్ ను గమనించి కాఫీ కావాలా? అంటూ సైగలు చేశాడు. అలా పలు పర్యాయాలు కాఫీ కావాలా? అని అడగడం కనిపించింది. ఈ వీడియోను బీసీసీఐ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. (వీడియో లింక్)
Rohit Sharma
coffee
Dharamsala
t20 match
srilanka

More Telugu News