Pulse Polio: నిండు జీవితానికి రెండు చుక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం

Pulse Polio Started in Telangana and Andhrapradesh
  • తెలంగాణలో 23,331 కేంద్రాల్లో పోలియో చుక్కల పంపిణీ
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలోనూ చుక్కల పంపిణీ
  • ఏపీలో సంచార జాతుల కోసం ప్రత్యేక వాహనాలు
దేశవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణలో 23,331 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. అలాగే, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో, ప్రధాన కూడళ్లలోనూ పోలియో చుక్కలు వేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోనూ పోలియో చుక్కల పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేశారు. పీహెచ్‌సీలు, సామాజిక కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు ఇతర ముఖ్య కూడళ్లలో పోలియో చుక్కలను పంపణీ చేస్తున్నారు. పోలియో చుక్కలను నేడు పంపిణీ చేయడంతోపాటు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, ప్రత్యేక ప్రదేశాల్లో నివసించే సంచార జాతుల కుటుంబాల చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 1,374 వాహనాలను ఏర్పాటు చేశారు.
Pulse Polio
Telangana
Andhra Pradesh

More Telugu News