Mahesh Babu: నిప్పులు చెరిగే 'భీమ్లా నాయక్'... మహేశ్ బాబు స్పందన

Mahesh Babu opines on Pawan Kalyan Bheemla Nayak
  • నిన్న రిలీజైన భీమ్లా  నాయక్
  • పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో చిత్రం
  • చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్న మహేశ్
  • చిత్రబృందానికి అభినందనలు
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. 

"భీమ్లా నాయక్ పాత్రలో నిప్పులు చెరిగే తీవ్రతతో, ఎగిసే జ్వాలలా పవన్ కల్యాణ్ కనిపిస్తే... డేనియల్ శేఖర్ గా రానా సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెరపై అద్భుతంగా నటించారు. ఎప్పట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి పదునైన డైలాగులు వచ్చాయి. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ కు ఇదే అత్యుత్తమం అని చెప్పాలి. 

నాకు నచ్చిన సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన రవి కె చంద్రన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. చివరిగా భీమ్లా నాయక్ కోసం తమన్ అందించిన సంగీతం గురించి చెప్పుకోవాలి. తమన్ సంగీతం మనల్ని వెన్నాడుతుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది... సెన్సేషనల్!

దర్శకుడు సాగర్ కె చంద్రకు, నటీమణులు నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టయిన్ మెంట్స్, నిర్మాత వంశీకి, యావత్ చిత్రబృందానికి అభినందనలు" అంటూ మహేశ్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Mahesh Babu
Bheemla Nayak
Pawan Kalyan
Rana Daggubati
Tollywood

More Telugu News