Bigg Boss: నాన్ స్టాప్ 'బిగ్ బాస్' లో ఇంటి సభ్యులు ఎవరో తెలుసా..?

Bigg Boss new season on Disney Plus Hotstar OTT starts
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తాజా సీజన్
  • నేటి నుంచి 24 గంటల స్ట్రీమింగ్
  • పాత కంటెస్టెంట్లు, కొత్తవారి కలయికతో తాజా బిగ్ బాస్ షో

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా బిగ్ బాస్ రియాలిటీ షో నేడు ప్రారంభమైంది. టీవీ చానళ్లలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో ఎడిట్ చేసిన కంటెంట్ ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో 24 గంటలు నాన్ స్టాప్ గా ప్రసారమవుతుంది. ఈ షోకి కూడా నాగార్జునే హోస్ట్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ స్ట్రీమింగ్ ప్రారంభమైందని నాగ్ వెల్లడించారు. 

కాగా, ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినవారిలో గతంలో ఈ రియాలిటీ షోలో పాల్గొన్నవారు కూడా ఉన్నారు. అరియానా, ముమైత్ ఖాన్, ఆషూ రెడ్డి, తేజస్విని మదివాడ, మహేశ్ విట్టా, నటరాజ్ మాస్టర్, హమీదా, అఖిల్ సార్దక్, సరయు ఉన్నారు. కొత్తగా బిందు మాధవి, ఆర్జే చైతూ, అజయ్ ఖతుర్వార్, మిత్ర శర్మ, శ్రీ రాపాక, స్రవంతి చొక్కారపు, అనిల్ రాథోడ్, శివ ఉన్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో ఈ షో 87 రోజుల పాటు కొనసాగనుంది.

  • Loading...

More Telugu News