Vijayasai Reddy: ప్రతిపక్ష హోదా గల్లంతైతే ఇంట్లో కూర్చుని మనవడితో ఆడుకోవాలి: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

Vijayasai Reddy comments on Chandrababu legislative life
  • చంద్రబాబు ప్రజాప్రస్థానానికి 44 ఏళ్లు
  • టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబుకు అభినందనలు
  • వ్యంగ్యంగా స్పందించిన విజయసాయిరెడ్డి
టీడీపీ అధినేత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 44 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు... కొంగర పట్టాభిరామ చౌదరిపై నెగ్గారు. చంద్రబాబు ప్రజాప్రస్థానంపై టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 'ప్రజా జీవితంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు గారికి అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. అయితే, చంద్రబాబు మరో 44 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉండాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా గల్లంతైతే ఇంట్లో కూర్చుని మనవడితో ఆడుకోవాలి అంటూ చంద్రబాబుపై వ్యంగ్యం ప్రదర్శించారు.
Vijayasai Reddy
Chandrababu
MLA
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News