Varla Ramaiah: సినిమా పరిశ్రమనూ వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా?: వ‌ర్ల రామ‌య్య‌

Varla Ramaiah slams ap govt
  • మన రాష్ట్రంలో పేదవాడికున్న ఏకైక వినోదం సినిమా
  • సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూడాలనుకుంటున్నారా?
  • "ఆ" సినిమా పట్ల మీకెందుకంత వివక్ష? అని రామ‌య్య ప్ర‌శ్న

సినీ ప‌రిశ్ర‌మ ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ క‌న‌బ‌రుస్తోన్న‌ తీరుపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య మండిప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'భీమ్లా నాయ‌క్' సినిమాపై ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల ఆయ‌న పరోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 

'మన రాష్ట్రంలో పేదవాడికున్న ఏకైక వినోదం "సినిమా". ఆ సినిమా పరిశ్రమను కూడ వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ! సిని"మా"కు కూడా కులగజ్జి అంటించి తమాషా చూడాలనుకుంటున్నారా? "ఆ" సినిమా పట్ల మీకెందుకంత వివక్ష? రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ప్రభుత్వమే సృష్టిస్తే ఎలా?' అని వ‌ర్ల రామ‌య్య నిల‌దీశారు.

  • Loading...

More Telugu News