Telangana: తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం

  • తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
  • రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్న వైద్య శాఖ
  • అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న హరీశ్ రావు
Pulse polio drive in Telangana tomorrow

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పల్స్ పోలియో కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియోను నిర్వహించనుంది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 

ఈ క్రమంలో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. అనంతరం రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు చెప్పారు. మరోవైపు రేపు 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు సూచించారు.

  • Loading...

More Telugu News