Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నుంచి పాన్ ఇండియా ప్రేమకథ!

Vijay Devarakondfa in Shiva Nirvana Movie
  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'లైగర్'
  • ఆగస్టు 25వ తేదీన విడుదల
  • తరువాత సినిమా శివ నిర్వాణతో
  • కథానాయికగా కియారా అద్వాని
  • లైన్లో ఉన్న సుకుమార్

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లైగర్' సినిమా రెడీ అవుతోంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు.

ఈ సినిమా తరువాత శివ నిర్వాణ, సుకుమార్ లతో తదుపరి సినిమాలు విజయ్ దేవరకొండ చేయనున్నాడు. ముందుగా శివ నిర్వాణ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇది ప్రేమకథా చిత్రమని అంటున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కియారా అద్వానీని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం శంకర్ - చరణ్ కాంబినేషన్లో చేస్తున్న ఆమె, ఆ తరువాత చేసే సినిమా ఇదే. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News