Chiranjeevi: పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంపై చిరంజీవి స్పందన

Chiranjeevi responds on Bheemla Nayak movie grand success
  • పవన్, రానా శక్తిమంతమైన పాత్రల్లో భీమ్లా నాయక్
  • నేడు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న భీమ్లా...
  • నిజంగా పవర్ తుపానే అంటూ చిరు ట్వీట్
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుపానే' అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్లా నాయక్ సెట్స్ పై సోదరుడు పవన్ కల్యాణ్, రానాలతో దిగిన ఫొటోను పంచుకున్నారు.

సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలన్నీ పాజటివ్ గా వచ్చాయి. విమర్శకులు సైతం పవన్, రానాల నటనకు ఫిదా అయ్యారు.
Chiranjeevi
Bheemla Nayak
Pawan Kalyan
Rana Daggubati

More Telugu News