agri gold: అగ్రిగోల్డ్ కేసు విచార‌ణ ఏలూరు కోర్టుకు బ‌దిలీ

  • హైకోర్టే చేప‌ట్టాల‌ని బాధితుల పిటిష‌న్‌
  • కుద‌ర‌ద‌న్న హైకోర్టు.. పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌
  • ఆస్తుల వేలం ద్వారా జ‌మ అయిన రూ.50 కోట్లూ ఏలూరు కోర్టుకు బ‌దిలీ
ap high court transfers agri gold case to eluru court

తెలుగు రాష్ట్రాల‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన ల‌క్ష‌లాది మందిని న‌ట్టేట ముంచిన అగ్రిగోల్డ్ కేసు విచార‌ణ‌లో శుక్ర‌వారం నాడు కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచార‌ణ ఇక‌పై ఏలూరు జిల్లా కోర్టులో జ‌ర‌గ‌నున్న‌ట్లుగా ఏపీ హైకోర్టు ప్ర‌క‌టించింది. అగ్రిగోల్డ్ కేసుతో పాటు ఇదే తర‌హాలో మోసానికి పాల్ప‌డ్డ అక్ష‌య గోల్డ్ కేసు విచార‌ణ‌ను కూడా ఏలూరు జిల్లా కోర్టుకు బ‌దిలీ చేస్తున్న‌ట్లుగా హైకోర్టు వెల్ల‌డించింది.

అంతేకాకుండా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ఇప్ప‌టిదాకా జ‌మ అయిన రూ.50 కోట్ల‌ను కూడా ఏలూరు కోర్టుకే బ‌దిలీ చేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. హైకోర్టే ఈ కేసు విచారించాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ఈ కేసు విచార‌ణ‌ను హైకోర్టు చేప‌ట్ట‌జాల‌ద‌ని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాము చేసిన సూచ‌న‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ఏలూరు జిల్లా కోర్టుకు హైకోర్టు సూచించింది.

More Telugu News