Russia: ఉక్రెయిన్ పై మధ్యశ్రేణి ఆయుధాలనే ఉపయోగిస్తున్న రష్యా

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • నిన్నటి నుంచి ఉక్రెయిన్ లో రష్యా సేనల దాడులు
  • పరిమిత సంఖ్యలో ఆయుధాలను వినియోగిస్తున్న రష్యా
Russia uses mid range weapons on Ukrain

దాదాపు ఉక్రెయిన్ నట్టింట్లోకి వెళ్లి యుద్ధం చేస్తున్న రష్యా... పొరుగు దేశాన్ని బాంబులతో మోతెక్కిస్తోంది. రష్యా ఆయుధ సంపత్తి గురించి తెలిసినవాళ్లకు ఈ యుద్ధం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా అనిపిస్తుంది. రష్యా వద్ద ఉన్న ఆయుధాల్లో కొన్ని అగ్రరాజ్యం అమెరికా వద్ద కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే, ఉక్రెయిన్ పై దాడికి రష్యా మధ్యశ్రేణి ఆయుధాలనే వినియోగిస్తోంది.

ముఖ్యంగా, కల్బీర్ క్రూయిజ్ మిస్సైళ్లు, సికిందర్ వ్యూహాత్మక బాలిస్టిక్ మిస్సైళ్లు, ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు, స్మెర్చ్ రాకెట్లను ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా ఉపయోగిస్తోంది. ఇవే కాకుండా, పదాతి దళాలకు వెన్నుదన్నుగా నిలిచే 75 ఫైటర్ జెట్లు, బాంబర్లను కూడా రంగంలోకి దించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పోరాటానికి మాత్రం 24 ఎంఐ-8 హెలికాప్టర్లను వాడుతోంది. అంతేకాదు, తన అమ్ములపొదిలోని కీలక యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్ భూభాగంపైకి నడిపింది.

కేవలం ఉక్రెయిన్ లోని సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు రష్యా అధినాయకత్వం చెబుతున్నప్పటికీ, కీవ్ లోని కొన్ని థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News