Harish Shankar: గర్జించే పవన్ కల్యాణ్ ని చూశా.. సినిమా అదిరింది: హరీశ్ శంకర్

I have seen roaring Pawan Kalyan in Bheemla Nayak sasy Harish Shankar
  • ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భీమ్లా నాయక్'
  • సినిమాపై ప్రశంసలు కురిపించిన హరీశ్ శంకర్
  • రానాను చూడలేదని.. డేనియల్ శంకర్ ను మాత్రమే చూశానని ప్రశంస

పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమా ఈరోజు విడుదలయింది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా సూపర్ హిట్ అంటూ పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ వీక్షించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ సినిమా అదిరిపోయిందని చెప్పారు. కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కల్యాణ్ ని చూశానని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ చంద్ర పనితీరు అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. తమన్ కెరీర్ లో ది బెస్ట్ ఇచ్చాడని ప్రశంసించారు. ఇది కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే కాదని, భీమ్లా నాయక్ కు బ్యాక్ బోన్ అని చెప్పారు. ఈ చిత్రంలో తాను రానాను చూడలేదని, కేవలం డేనియల్ శేఖర్ ని మాత్రమే చూశానని అన్నారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. రావు రమేశ్, మురళి శర్మ, సముద్ర ఖని ప్రధాన పాత్రలను పోషించారు.

  • Loading...

More Telugu News