Ishan Kishan: లంక బౌలింగ్ ను ఊచకోత కోసిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్... టీమిండియా భారీ స్కోరు

Ishan Kishan and Shreyas Iyer hammers Sri Lanka bowlers in Lucknow
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • కిషన్, అయ్యర్ అర్ధసెంచరీలు
  • లంక బౌలర్ల విలవిల
  • రాణించిన రోహిత్ శర్మ
లక్నోలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. కిషన్ ఉన్నంతసేపు ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్... కిషన్ అవుటయ్యాక లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ 28 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 2 భారీ సిక్సులున్నాయి.

అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే.
Ishan Kishan
Shreyas Iyer
Team India
Sri Lanka
1st T20
Lcuknow

More Telugu News