Ukraine: ఉక్రెయిన్‌లోని భార‌తీయుల త‌ర‌లింపున‌కు ఏర్పాట్లు

  • హంగేరీ ప్ర‌భుత్వం సాయం తీసుకునే అవ‌కాశం
  • ఇప్ప‌టికే జొహ‌నై స‌రిహ‌ద్దుల‌కు చేరుకున్న భార‌త ఎంబసీ అధికారులు
  • హంగేరీ స‌రిహ‌ద్దుల‌కు భార‌తీయుల‌ను త‌ర‌లిస్తే ప‌ని అయిపోయిన‌ట్టే
Arrangements for the repatriation of Indians in Ukraine

ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను సుర‌క్షితంగా తీసుకువ‌చ్చేందుకు భారత ప్ర‌భుత్వం య‌త్నాలు ప్రారంభించింది. ఓ వైపు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌తో పాటు ప్ర‌ధాన న‌గ‌రాల‌పై ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. బాంబుల మోత‌తో ప్ర‌స్తుతం ఉక్రెయిన్ మొత్తం ద‌ద్ద‌రిల్లుతోంది.

ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లో చిక్కుబ‌డిపోయిన భార‌తీయుల త‌ర‌లింపున‌కు మరింతగా వేచిచూడాలని భార‌త్ అనుకోవ‌డం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించిన భార‌త ఎంబ‌సీ అధికారులు హంగేరీ మీదుగా భార‌తీయుల‌ను తీసుకురావాల‌ని యోచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే జొహ‌నై స‌రిహ‌ద్దుల‌కు భార‌త ఎంబ‌సీ అధికారులు చేరుకున్నారు. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న భార‌తీయుల‌ను ఎలాగోలా హంగేరీ స‌రిహ‌ద్దుల దాకా తీసుకువ‌స్తే.. అక్క‌డి నుంచి హంగేరీ ప్ర‌భుత్వ సాయం తీసుకుని భార‌తీయుల‌ను సుర‌క్షితంగా దేశానికి తీసుకురావ‌చ్చ‌ని భావిస్తున్నారు.

More Telugu News