Nithin: 'రంగస్థలం' తరహాలోనే నితిన్ తాజా చిత్రం?

Macharla Niyojakavargam movie update
  • నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం'
  • గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా కృతి శెట్టి
  • ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు
నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుందనే విషయాన్ని పోస్టర్ ద్వారానే చెప్పేశారు. అయితే కథా లక్షణాలు 'రంగస్థలం' సినిమాకి దగ్గరగా కనిపిస్తాయని అంటున్నారు.

నితిన్ సినిమా గ్రామీణ నేపథ్యంలో .. అక్కడి రాజకీయాలతో ముడిపడి నడుస్తుంది. ఎప్పుడూ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా గెలిచి అక్రమాలకు పాల్పడుతున్న పెద్ద మనిషి ఆటకట్టించడం కోసం, ఆ పదవికి పోటీ చేస్తూ హీరో రంగంలోకి దిగుతాడట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రివేంజ్ డ్రామా మొదలవుతుందని అంటున్నారు.

నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 'భీష్మ' తరువాత నితిన్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.
Nithin
krithi Shetty
Macharla NIyojaka Vargam Movie

More Telugu News