Natti Kumar: ఏపీలో రద్దయిన జీవో ప్రకారం టికెట్లు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు: ఫిలిం చాంబర్ ఆరోపణ

Telugu Film Chamber press meet over cinema tickets issue
  • ఏపీలో మరోసారి సినీ టికెట్ల వివాదం
  • రేపు భీమ్లా నాయక్ విడుదల
  • పాత జీవో అమలు చేస్తున్నారని ఫిలిం చాంబర్ వెల్లడి
  • థియేటర్ యాజమాన్యాలను బెదిరిస్తున్నారని వ్యాఖ్యలు

ఏపీలో సినిమా టికెట్ల వివాదం మరోసారి రాజుకుంది. రేపు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. రద్దయిన జీవో.35 ప్రకారం టికెట్లు అమ్మాలంటూ థియేటర్ల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించింది. హైదరాబాదులో ఇవాళ ఫిలిం చాంబర్ గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత నట్టి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, రద్దు చేసిన జీవో ప్రకారం టికెట్లు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. పాత జీవో ప్రకారం టికెట్ల విక్రయం చేపట్టాలని ఎగ్జిబిటర్లను ఒత్తిడి చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొన్నారు. బెదిరించడం ద్వారా ఏపీ రెవెన్యూ ఉద్యోగులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

కొందరు రాజకీయనేతలు కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారని, సీఎం జగన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీవో.35 కంటే ముందున్న జీవో.100 ప్రకారమే టికెట్ల విక్రయం జరిగేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News