Telangana: రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని కోరారు:మంత్రి ప్రశాంత్ రెడ్డి

Raichur BJP MLA asked to merge their constitution in to Telangana says Prashanth Reddy
  • తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోంది
  • మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు వారిని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు
  • తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారన్న మంత్రి 

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి పథకం, ప్రతి సంక్షేమ పథకం కింది స్థాయి వరకు చేరేలా పని చేయాలని పిలుపునిచ్చారు. లేకపోతే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందని అన్నారు.  

మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని అడిగారని, కర్ణాటక రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని కోరారని... తెలంగాణలో అభివృద్ధి లేకపోతే తెలంగాణలో కలపాలని ఎందుకు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని అన్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారిని గ్రామాల్లోకి కూడా రానివ్వబోమని చెప్పారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీ మనకు అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News