Nara Lokesh: ఉనికి చాటుకునేందుకే లోకేశ్ పాట్లు: వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

vijay saireddy says Lokesh sings to express his existence
  • సాక్షి ప‌త్రిక‌పై ప‌రువు న‌ష్టం దావా వేసిన లోకేశ్
  • ఆ కేసు విచార‌ణ కోసం విశాఖ వ‌చ్చిన టీడీపీ నేత‌
  • ప‌రువు న‌ష్టం దావాలు వేయాలంటే లోకేశ్ పై రోజుకు ప‌ది ప‌డ‌తాయ‌న్న విజయసాయి  
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌పై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి మ‌రోమారు ట్విట్ట‌ర్ వేదిక‌గా విరుచుకుప‌డ్డారు. ఇంకా తాము ఉన్నామ‌ని ఉనికి చాటుకునేందుకే లోకేశ్ విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చార‌ని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

రోడ్డుపై మీడియా స‌మావేశాలు పెట్టి సినిమా డైలాగ్స్ చెప్పినా ఒక్క‌రు కూడా అటువైపు తిరిగి చూడ‌టం లేద‌న్న సాయిరెడ్డి.. టీడీపీ ప‌ని అయిపోయింద‌న్న విష‌యం తెలియ‌డం లేదా? అని లోకేశ్ ను ప్ర‌శ్నించారు. ప‌రువు న‌ష్టం దావాలు వేయాలంటే లోకేశ్ పై రోజుకు ప‌ది ప‌డ‌తాయ‌ని కూడా సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

గ‌తంలో త‌న‌పై సాక్షి ప‌త్రిక త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించిందంటూ ఆ ప‌త్రిక యాజ‌మాన్యంపై రూ.75 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావావేసిన లోకేశ్.. ఆ కేసు విచార‌ణ కోస‌మంటూ గురువారం నాడు విశాఖ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నం రాసిన సాక్షి ప‌త్రిక త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పేదాకా వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ఆయన ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
Nara Lokesh
Vijay Sai Reddy
Vizag

More Telugu News