Poonam Kaur: రామ్ గోపాల్ వర్మపై విమర్శలు గుప్పించిన పూనమ్ కౌర్

Poonam Kaur fires on Ram Gopal Varma
  • పవన్ ప్రసంగం అద్భుతమంటూ ట్వీట్ చేసిన వర్మ
  • ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడతాడంటూ పూనమ్ ఫైర్
  • సినిమా వాళ్లు రాజకీయ నాయకుల దగ్గర చేతులు జోడించడంపై ఆవేదన

సినీ నటి పూనమ్ కౌర్ చేసే వ్యాఖ్యలు ఎక్కువగా వివాదాస్పదమవుతుంటాయి. తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ గా మారాయని, ఎంటర్టైన్మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయని ఆమె వ్యాఖ్యానించింది. తాను మనస్పూర్తిగా ఆదరించి, ప్రేమించిన వ్యక్తులు ఈ రాజకీయ నాయకుల దగ్గర వాళ్లకు వాళ్లు తక్కువ చేసుకుని, చేతులు జోడించి, చేతులు కట్టుకుంటూ ఉండటం తనకు చాలా బాధను కలిగిస్తోందని అన్నారు. అవసరాల కోసం వ్యక్తిత్వం చంపేసుకోవడం మానేయాలని చెప్పారు.

'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతమంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఆమె స్పందిస్తూ... ఒక దర్శకుడు మూల నుండి నవ్వుతూ, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడతాడని... మరొక దర్శకుడు రాజకీయంగా ఆయనను కించపరుస్తూ ట్విట్టర్లో నవ్వుతాడని విమర్శించారు.

  • Loading...

More Telugu News