పవన్ కల్యాణ్ ప్రసంగంపై రామ్ గోపాల్ వర్మ స్పందన
- నిన్న అట్టహాసంగా జరిగిన 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్
- పవన్ స్పీచ్ అద్భుతంగా ఉందన్న వర్మ
- పవన్ ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉందని కితాబు
ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్ ప్రసంగం ఎంతో హుందాగా, అద్భుతంగా, మనసును హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉందని ఆయన కితాబునిచ్చారు. ఆయన ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉందని చెప్పారు.