ఈ ఒక్క సినిమా విడుదల పట్ల ఏపీ సర్కారు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోంది?: వర్ల రామయ్య
- ‘భీమ్లా నాయక్’ సినిమాపై ఆంక్షలు ఎందుకు?
- ఐదు షోలు వెయ్యకూడదంటూ సినిమా హాళ్లకు నోటీసులు
- ఆ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో!
- రైతులు, దళితులు, మహిళల సమస్యలు మాత్రం పట్టవు అని వర్ల ఆగ్రహం
ఒక్క సినిమా విడుదల పట్ల రాష్ట్ర సర్కారు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఐదు షోలు వెయ్యకూడదంటూ సినిమా హాళ్లకు నోటీసులిస్తున్నారని ఆయన అన్నారు. ఆ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో! అంటూ ఆయన చురకలంటించారు. రైతులు, దళితులు, మహిళల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని, కానీ ఆ సినిమా మాత్రం పెద్ద సమస్య అయిందా? అని నిలదీశారు.