Russia: రష్యా దాడులు చేసింది ఈ నగరాలపైనే

  • కీవ్ ను ఇప్పటికే ఆక్రమించిన రష్యా బలగాలు
  • రెండో అతిపెద్ద సిటీ ఖార్కివ్ పైనా దాడి
  • రష్యా సిటీ బెల్గొరోడ్ లోనూ దాడి జరిగినట్టు కథనాలు
Russia Attacks These Cities

గురువారం తెల్లవారుతుండగానే ఉక్రెయిన్ ప్రజలు బాంబుల మోతతో నిద్ర లేచారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని చాలా నగరాలపై బాంబులతో విరుచుకుపడుతూ ఆక్రమించేశాయి.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పైనే రష్యా బలగాలు మొదట దాడి చేశాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించాయి. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు.. రాజధానిలోని బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు పేర్కొన్నారు.
ఖార్కివ్: ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నూ టార్గెట్ చేస్తూ రష్యా దాడులకు పాల్పడింది.
క్రమటోర్స్క్: డొనెట్స్క్ కు 120 కిలోమీటర్ల దూరంలోని ఈ నగరంలోనూ రెండు భారీ పేలుళ్లు జరిగినట్టు అక్కడి ప్రజలు వెల్లడించారు.
దినిప్రో: ఈ సిటీలో పలు బాంబు దాడులు జరిగినట్టు ఓ స్థానికుడు చెప్పారు.
మరియపోల్: సిటీకి తూర్పు ప్రాంతంలో రెండు మూడు బాంబు పేలుళ్ల మోతలు వినిపించాయంటూ కొందరు స్థానికులు తెలిపారు.
ఒడెస్సా: నల్ల సముద్రం పోర్టు సిటీ అయిన ఇక్కడ 20 నిమిషాల వ్యవధిలో రెండు భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
జపోరిఝియా: ఉక్రెయిన్ దక్షిణాది నగరమైన ఇక్కడ ఓ భారీ పేలుడు సంభవించింది.
లెవివ్: లెవివ్ పై రష్యా బలగాలు వైమానిక దాడులు చేశాయి. ఇవాళ ఉదయం 7.45 గంటలకు దాడులకు తెగబడ్డాయి.

ఇవి కాకుండా రష్యాలోని బెల్గొరోడ్ నగరంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చెబుతున్నారు.

  

More Telugu News