Ukraine: ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థుల కోసం కేంద్రానికి జ‌గ‌న్ లేఖ‌

cmJagan writes a letter to the Center for AP Students in Ukraine
  • ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య యుద్ధ మేఘాలు
  • భార‌తీయులు దేశానికి రావాలంటూ ఇప్ప‌టికే కేంద్రం పిలుపు
  • ఏపీ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా తీసుకురావాలంటూ సీఎం విజ్ఞ‌ప్తి
ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య యుద్ధ వాతావర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో ఉంటున్న భార‌తీయుల‌ను సుర‌క్షితంగా దేశానికి త‌ర‌లించే ప‌నిని కేంద్రం ఇప్ప‌టికే చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో చ‌దువుకుంటున్న ఏపీ విద్యార్థులను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావ‌డానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల మంత్రికి లేఖ రాశారు.

ఉక్రెయిన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావాల‌ని స‌ద‌రు లేఖ‌లో జ‌గ‌న్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిని కోరారు. ఈ విష‌యంలో ఏపీ నుంచి ఎలాంటి స‌హ‌కారం అందించ‌డానికైనా తాము సిద్ధంగా ఉన్నామ‌ని కూడా జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థుల‌ను త‌క్ష‌ణ‌మే సుర‌క్షితంగా వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చాల‌ని జ‌గ‌న్ కోరారు.
Ukraine
Russia
external affairs minister
ap cm jagan

More Telugu News