Janvi Kapoor: జాన్వీ కపూర్ విషయంలో అదంతా రూమరే!

Boney Kapoor gave a clarity on Janvi kapoor
  • బాలీవుడ్లో బిజీగా జాన్వీ కపూర్
  • టాలీవుడ్ పట్ల చూపుతున్న ఆసక్తి
  • ఎన్టీఆర్ తో చేయనుందంటూ వార్తలు
  • ఎవరూ సంప్రదించలేదన్న బోనీ కపూర్
బాలీవుడ్ లో శ్రీదేవి వారసురాలిగా ఆ స్థాయిని .. స్థానాన్ని అందుకోవడానికి జాన్వీ కపూర్ తనవంతు ప్రయత్నం చేస్తోంది. అలాగే మంచి కథ .. పాత్ర వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను ఇస్తోంది. ముఖ్యంగా తెలుగులో చేయడానికి ఆమె కొంతకాలంగా ఉత్సాహాన్ని చూపుతోంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా అతని జోడీగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. కొరటాల - ఎన్టీఆర్ సినిమా విషయంలోను జాన్వీ కపూర్ పేరు వినిపించింది. అయితే నిర్మాతగా 'వలిమై' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బోనీ కపూర్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ - కొరటాల సినిమా మాత్రమే కాదు .. అసలు తెలుగులోనే జాన్వీ కపూర్ ఏ సినిమా చేయడం లేదనీ, తమని ఎవరూ సంప్రదించలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మంచి స్క్రిప్ట్ వస్తే మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నిటిలోను చేయడానికి జాన్వీ సిద్ధంగా ఉందని చెప్పారు.
Janvi Kapoor
Boney Kapoor
Valimai Movie

More Telugu News