Sunil: సునీల్ హీరోగా 'కుంభకర్ణ' .. టైటిల్ పోస్టర్ రిలీజ్!

  • 'కుంభకర్ణ'గా సునీల్
  • విలన్ గా కబీర్ దుహాన్ సింగ్
  • సంగీత దర్శకుడిగా సాయికార్తీక్
  • దర్శకుడిగా అభిరామ్ పరిచయం  
Kumbhakarna title poster released

హీరోగా వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వచ్చిన సునీల్, ఆ తరువాత కమెడియన్ గానే కొనసాగాలని అనుకున్నాడు. అయితే ఆయన ఆశించిన స్థాయి పాత్రలు పడలేదు. దాంతో విలక్షణమైన పాత్రలపై దృష్టిపెడుతూ ఆ దిశగా అడుగులు వేశాడు. ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే వర్కౌట్ అయింది.

విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలు సునీల్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన 'కలర్ ఫొటో' ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమాలు ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి 'కుంభకర్ణ' టైటిల్ ను ఖరారు చేసి తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పడుకుంటే పోతాడు' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్.

సునీల్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను కబీర్ దుహాన్ సింగ్ పోషిస్తున్నాడు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో అభిరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి..

More Telugu News