Ramcharan: 'భీమ్లా నాయక్' ట్రైలర్ పై రామ్ చరణ్ స్పందన

Pawan Kalyan dialogues are superb in Bheemla Nayak trailer says Ramcharan
  • ట్రైలర్ ఎలక్ట్రిఫయింగ్ అన్న చెర్రీ
  • పవన్ డైలాగులు, యాక్షన్ పవర్ ఫుల్ గా ఉన్నాయని ప్రశంస
  • రానా పర్ఫామెన్స్ అద్భుతమని కితాబు
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' ట్రైలర్ ఈ నెల 21న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది.

ట్రైలర్ పై రామ్ చరణ్ తేజ్ ప్రశంసలు కురిపించాడు. 'భీమ్లా నాయక్' ట్రైలర్ ఎలక్ట్రిఫయింగ్ అని చెర్రీ ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ గారి డైలాగులు, యాక్షన్ పవర్ ఫుల్ అని కితాబునిచ్చాడు. రానా దగ్గుబాటి పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఇక ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. థమన్ సంగీతాన్ని అందించారు.
Ramcharan
Pawan Kalyan
Rana Daggubati
Bheemla Nayak
Tollywood

More Telugu News