'డాన్'తో సంబంధాలు.. 'మహా' మంత్రి నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసిన ఈడీ
- ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో మంత్రిగా నవాబ్ మాలిక్
- దావూద్‌తో సంబంధాల ఆరోపణలతో అరెస్ట్
- ఈడీ చర్యపై శివసేన, ఎన్సీపీ ఆగ్రహం
ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఇటు శివసేనతో పాటు, అటు దాని మిత్రపక్షం ఎన్సీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత మిమ్మల్ని మేం విచారిస్తామంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారును ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.