Samantha: ఊ అంటావా నల్గొండ.. ఉఊ అంటావా: పట్టణంలో సమంత సందడి

Samantha in Nalgonda
  • నల్గొండలో సందడి చేసిన సమంత
  • మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరైన సామ్
  • సమంతను చూసేందుకు ఎగబడిన అభిమానులు
టాలీవుడ్ అందాలభామ సమంత ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు దక్షిణాదిలో బిజీగా ఉంటూనే ఉత్తరాదిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ ద్వారా ఆమె ఉత్తరాది సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా 'పుష్ప' సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ 'ఊ అంటావా.. ఉఊ అంటావా' సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

 మరోవైపు ఆమె ఈ రోజు ఉదయం నల్గొండ పట్టణంలో పర్యటించి, సందడి చేసింది. మాంగల్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కు ఆమె హాజరయింది. ఆమె చేతుల మీద షాపింగ్ మాల్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samantha
Tollywood
Nalgonda

More Telugu News