Allu Arjun: సోషల్ మీడియాను ఊపేస్తున్న వీధి వ్యాపారి ‘కచ్చా బాదం’ సాంగ్.. అల్లు అర్హ నుంచి ఇంటర్నేషనల్ స్టార్స్ దాకా చిందులు.. ఇదిగో వీడియో

Allu Arha and Other International Stars Dance For Kacha Badam Goes Viral
  • పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన పాట
  • ఓవర్ నైట్ స్టార్ గా మారిన భుబన్ బద్యాకర్
  • అల్లు అర్హ డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన అల్లు అర్జున్
కొన్ని కొన్ని పాటలు ఎందుకు వైరల్ అవుతాయో, ఎలా ఫేమస్ అవుతాయో కూడా చెప్పలేం. ఆ కోవలోకే వస్తుంది పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వీధి వ్యాపారి పాడిన ‘కచ్చా బాదం’ అనే పాట. రోడ్డు మీద పల్లీలు అమ్ముకుంటూ పది మంది ఉన్న తన కుటుంబాన్ని పోషించే భుబన్.. పల్లీలు అమ్మేటప్పుడు ‘కచ్చా బాదం’ పాటను పాడేవాడు.

పాట ఆ నోటా..ఈ నోటా పడింది. అంతే ఓ యూట్యూబ్ ర్యాపర్ అతడితో పాటను కంపోజ్ చేశాడు. ఈ నెలలోనే ఐదో తేదీన యూట్యూబ్ లో ఆ పాటను రిలీజ్ చేశాడు. అంతే.. అందరిలోనూ అతడు బాగా ఫేమస్ అయిపోయాడు. అప్పటిదాకా కష్టాలే తప్ప సుఖాలు తెలియని భుబన్ అదృష్టవంతుడైపోయాడు.

ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గర్నుంచి ఇంటర్నేషనల్ స్టార్స్ దాకా ఆ పాటకు చిందులేస్తున్నారంటే ఆ పాట ఎంత పాప్యులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 5,35,60,841 మంది ఆ పాటను చూశారు. గత వారం ఓ ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆ ట్యూన్ ను వాడుకునేందుకు రూ.లక్షన్నర రాయల్టీగా అతడికి అందించింది కూడా.

టాలీవుడ్ ప్రముఖులూ ఆ పాటకు ఇన్ స్టా రీల్స్ లో కాలు కదుపుతున్నారు. అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, యాంకర్ లాస్య, టాలీవుడ్ నటి సురేఖా వాణి, బాలీవుడ్ ప్రముఖులు ఆ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అల్లు అర్హ డ్యాన్స్ చేస్తున్న వీడియోను బన్నీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.








Allu Arjun
Tollywood
Bollywood
Kacha Badam
Allu Arha

More Telugu News