Mekapati Goutham Reddy: ముగిసిన గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌లు.. జ‌గ‌న్ స‌హా ప్ర‌ముఖుల క‌న్నీటి వీడ్కోలు

goutham reddy last rituals
  • ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీ స‌మీపంలో అంత్య‌క్రియ‌లు
  • దహన సంస్కారాలు నిర్వ‌హించిన కృష్ణార్జున‌రెడ్డి
  • ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

ఆంధ్రప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీ స‌మీపంలో గౌత‌మ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దంప‌తుల‌తో పాటు ప‌లువురు మంత్రులు అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

అలాగే, వైసీపీ కార్య‌క‌ర్త‌లు, స్థానికులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మేకపాటి గౌతమ్‌రెడ్డికి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. మొన్న హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి గుండెపోటుతో హ‌ఠాన్మ‌రణం చెందిన విష‌యం తెలిసిందే.

కాగా, అంత్య‌క్రియ‌ల‌కు ముందు మేక‌పాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమ యాత్ర కొన‌సాగింది. ఆయ‌న భౌతికకాయాన్ని చూసి సొంత గ్రామ ప్ర‌జ‌లు క‌న్నీటి పర్యంతమయ్యారు. ఆయ‌న‌కు పుష్పాంజలి ఘటించి ఘననివాళులు అర్పించారు. బుచ్చి, సంగం, నెల్లూరిపాలెం గ్రామాల మీదుగానూ ఆయ‌న అంతిమ యాత్ర కొనసాగింది.

  • Loading...

More Telugu News