Naresh: సినీ నటుడు నరేశ్ మాజీ భార్యపై కేసు నమోదు

Case filed against Actor Naresh Ex wife
  • నరేశ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తోందంటూ ఐదుగురు మహిళల ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
  • రమ్యతో తనకు సంబంధం లేదన్న నరేశ్ 
సీనియర్ సినీ నటుడు నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతిపై పోలీసు కేసు నమోదైంది. నరేశ్ పేరుతో ఆమె డబ్బు వసూలు చేస్తోందంటూ ఐదుగురు మహిళలు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

నరేశ్ కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఆమె. ఎనిమిదేళ్ల క్రితం ఆమెను నరేశ్ పెళ్లాడారు. అయితే తర్వాత ఆమె నుంచి ఆయన విడిపోయారు. నరేశ్ కు చెందిన ఆస్తులను చూపుతూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని చెపుతూ, చాలా మంది నుంచి ఆమె డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు. మరోవైపు దీనిపై నరేశ్ స్పందిస్తూ రమ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
Naresh
Ex Wife
Police Case

More Telugu News